రోడ్లపై పశువుల స్వైర విహారం.. వాహనదారుల ప్రాణాలతో చెలగాటం! యజమానుల నిర్లక్ష్యంపై చర్యలేవీ? ప్రమాదాలు జరిగితేనే అధికారులు స్పందిస్తారా? మున్సిపల్ అధికారుల తీరుపై వాహనదారుల్లో తీవ్ర అసంతృప్తి
శుభోదయ డైనమిక్ వార్త – హుజూర్నగర్, ఆగస్టు 13 హుజూర్నగర్ పట్టణంలో పశువుల యజమానులు తమ పశువులను యథేచ్ఛగా రోడ్లపై వదిలేస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులపైనే పశువులు సంచరిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాత్రివేళల్లో మరింత ప్రమాదకరం పగటిపూట వాహనాల రద్దీ ఉండే ప్రధాన రహదారులపై పశువులు అడ్డంగా తిరుగుతుండటంతో వాహనదారులు వాటిని తప్పించుకుంటూ ప్రయాణించాల్సి వస్తోంది. రాత్రి వేళల్లో రోడ్లపైనే పశువులు సేదతీరుతుండటంతో ద్విచక్రవాహనదారులకు ప్రమాదం మరింత పొంచి ఉంది. ప్రమాదం జరిగే వరకు అధికారులకు కనిపించవా? పశువులను రోడ్లపై వదిలే యజమానులపై చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు...