సాగునీరు, 24 గంటల విద్యుత్‌ కోసం బీఆర్‌ఎస్‌ రైతు ధర్నా

నేరేడుచర్ల, ఆగస్టు 26, శుభోదయ డైనమిక్ వార్త సాగునీరు అందించడంతో పాటు రైతులకు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ నేరేడుచర్లలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భారీ రైతు ధర్నా నిర్వహించారు. నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకీడు మండలాలకు చెందిన సుమారు 500 మంది రైతులు ధర్నాలో పాల్గొని ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. సాగర్‌ ఎడమ కాల్వ నుంచి వెంటనే నీరు విడుదల చేయాలి ధర్నాను ఉద్దేశించి హుజూర్‌నగర్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ సమన్వయకర్త ఒంటెద్దు నర్సింహారెడ్డి మాట్లాడుతూ సాగర్‌ ఎడమ కాల్వ నుంచి రైతులకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పంటలు సాగు చేసుకునే...