పాత కక్షలు.. వేప చెట్టు వివాదంతో ఘర్షణ గొడ్డళ్లతో పరస్పర దాడి.. ఇద్దరు మృతి ఎస్సై నవీన్‌కుమార్‌కు గాయాలు.. కోదాడ డీఎస్పీ పరిశీలనఎర్రగట్టు తండాలో పోలీసుల బందోబస్తు

శుభోదయ డైనమిక్ వార్త – హుజూర్‌నగర్,ఆగస్టు 30 మేళ్లచెరువు మండలం ఎర్రగట్టు తండాలో పాత కక్షలతో పాటు వేప చెట్టు సరిహద్దు విషయంలో శనివారం ఉదయం ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర విషాదానికి దారితీసింది. సుమారు ఉదయం 8 గంటల సమయంలో ఇరువర్గాలు గొడ్డళ్లతో పరస్పరం దాడి చేసుకున్నట్లు సమాచారం. గొడ్డలి దాడిలో ఇద్దరు మృతి ఈ ఘర్షణలో మంద వెంకటేశ్వర్లు యాదవ్‌ గొడ్డలి దాడికి గురై సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో వ్యక్తి సైదాకు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు సమాచారం. ఎస్సైపై దాడి.. తీవ్ర గాయాలు ఘర్షణ విషయం తెలుసుకున్న మేళ్లచెరువు...