మద్యం మత్తులో పాఠశాలకు ఉపాధ్యాయుడు రాజీవ్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో కలకలండ్రింకింగ్ టెస్ట్‌లో 196గా నమోదైనట్లు సమాచారం.. విచారణకు డిమాండ్

నేరేడుచర్ల, సెప్టెంబర్ 1, శుభోదయ డైనమిక్ నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ధరావత్ విరియాపై మద్యం సేవించి విధులకు హాజరవుతున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ విషయంపై సమాచారం అందడంతో సంబంధిత పాఠశాలలో పరిస్థితిని పరిశీలించగా, ఉపాధ్యాయుడు మద్యం సేవించిన స్థితిలో ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం పోలీసుల సమక్షంలో డ్రింకింగ్ టెస్ట్ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడికి డ్రింకింగ్ టెస్ట్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ పరీక్షలో 196 విలువ నమోదైనట్లు సమాచారం. అయితే పరీక్షకు సంబంధించిన అధికారిక నివేదిక, పోలీసుల ధ్రువీకరణ వెలువడాల్సి ఉంది. రెండేళ్లుగా ఆరోపణలు? సదరు ఉపాధ్యాయుడు గత రెండేళ్లుగా మద్యం సేవించి...