పార్టీ కోసం పనిచేసిన యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవుల్లో హుజూర్‌నగర్‌కు ఎప్పుడు అవకాశం..?

శుభోదయ డైనమిక్ న్యూస్ –హుజూర్‌నగర్,సెప్టెంబర్ 8 “అప్పుడు ఉత్తమ్ వేరు.. ఇప్పుడు ఉత్తమ్ వేరు.. మంత్రి ఉత్తమ్ మారిపోయారా..?” ప్రస్తుతం హుజూర్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో ఈ ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. అధికారం రాకముందు నాయకులు, కార్యకర్తలకు ఇచ్చిన హామీలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలులో జాప్యం జరుగుతోందనే విమర్శలు ఆశావహుల్లో అసంతృప్తికి కారణమవుతున్నాయి. ఎన్నికల ముందు హామీలు.. ఇప్పుడు ఎదురుచూపులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి అహర్నిశలు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు రాజకీయంగా తగిన గుర్తింపు, ప్రాధాన్యత కల్పిస్తామని హామీలు ఇచ్చారని పలువురు గుర్తుచేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తమకు నామినేటెడ్ పదవులు, వివిధ...