నేరేడుచర్ల మున్సిపల్ కౌన్సిల్ భేటీ అభివృద్ధి పనులకు 17 తీర్మానాలు ఏకగ్రీవ ఆమోదం పారిశుద్ధ్యం, తాగునీరు, మౌలిక వసతులకు ప్రాధాన్యం

నేరేడుచర్ల, సెప్టెంబర్ 8, శుభోదయ డైనమిక్ న్యూస్ నేరేడుచర్ల పురపాలక సంఘ సాధారణ కౌన్సిల్ సమావేశం మంగళవారం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో చైర్మన్ కొనతం వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ, ఘన వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై కౌన్సిల్ సభ్యులు విస్తృతంగా చర్చించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరిచే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ.18.75 లక్షల అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అభివృద్ధి పనుల కోసం మొత్తం 17 తీర్మానాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు పట్టణ పారిశుద్ధ్య నిర్వహణను...