మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం

నేరేడుచర్లలో పినాకిల్ పాఠశాల విద్యార్థుల భారీ అవగాహన ర్యాలీ నేరేడుచర్ల,శుభోదయ డైనమిక్ వార్త, సెప్టెంబర్ 11 వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పినాకిల్ పాఠశాల విద్యార్థులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం విద్యార్థులు స్వయంగా మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసి, నేరేడుచర్ల పట్టణంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి మట్టి విగ్రహాలపై అవగాహన పాఠశాల ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు మట్టిని సేకరించి వినాయక విగ్రహాలను తయారు చేశారు. అనంతరం చేతుల్లో మట్టి వినాయక విగ్రహాలు, పర్యావరణ పరిరక్షణ నినాదాలతో కూడిన ప్లకార్డులు పట్టుకుని పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్లాస్టర్ ఆఫ్ పారిస్,...