కోదాడ మెగా జాబ్ మేళాకు యువత అధిక సంఖ్యలో హాజరుకావాలి 19న కోదాడలో ఉద్యోగ మేళా

నేరేడుచర్ల,శుభోదయ డైనమిక్ వార్త, సెప్టెంబర్ 16 ఈ నెల 19న శనివారం కోదాడ పట్టణంలోని సీసీ రెడ్డి కాన్వెంట్‌లో నిర్వహించే మెగా జాబ్ మేళాకు అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులు అధిక సంఖ్యలో హాజరై ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కోణతం చిన్న వెంకటరెడ్డి కోరారు. 300 కంపెనీలకు పైగా పాల్గొనే అవకాశం రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 కంపెనీలు మేళాలో పాల్గొననున్నట్లు చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన...