క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ శుభోదయ డైనమిక్ వార్త కథనానికి స్పందన మద్యం మత్తులో విధులకు హాజరైన టీచర్‌ సస్పెండ్‌ 196 ఎంజీ మద్యం పరీక్ష నివేదికపై డీఈఓ చర్యలు

నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్ వార్త,సెప్టెంబర్ 18 శుభోదయ డైనమిక్ వార్తలో ప్రచురితమైన కథనానికి స్పందించిన విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకున్నారు. మద్యం మత్తులో పాఠశాలకు హాజరైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేరేడుచర్ల మండలం రాజీవ్‌నగర్‌ ఎంపీపీఎస్‌ పాఠశాల ఎస్‌జీటీ ఉపాధ్యాయుడు ధరావత్ వీర్యాను సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారి కె. అశోక్‌ సస్పెండ్‌ చేశారు. బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలో 196 ఎంజీ ఉపాధ్యాయుడు విధుల్లో ఉన్న సమయంలో నిర్వహించిన బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలో 196 ఎంజీ/100 ఎంఎల్‌ ఆల్కహాల్‌ స్థాయి నమోదైనట్లు అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విషయంపై సెప్టెంబర్‌ 1న శుభోదయ డైనమిక్ వార్తలో కథనం ప్రచురితమైంది. అనంతరం సంబంధిత నివేదికలు, ఆధారాలను పరిశీలించిన...