హుజూర్‌నగర్ పాత బస్టాండ్‌లో ప్రయాణికుల అవస్థలు షెడ్డు లేదు.. సౌకర్యాలు లేవు.. షాపుల ముందే ప్రయాణికుల నిరీక్షణ మున్సిపాలిటీ–వక్ఫ్ బోర్డు కేసుతో అభివృద్ధికి బ్రేక్‌? అధికారుల స్పందన కోసం ఎదురుచూపులు

శుభోదయ డైనమిక్ వార్త – హుజూర్‌నగర్,సెప్టెంబర్ 23 హుజూర్‌నగర్ పట్టణంలోని పాత బస్టాండ్‌ ప్రయాణికులకు నిత్య అవస్థలు తప్పడం లేదు. బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులకు కనీసం కూర్చునేందుకు షెడ్డు కూడా లేకపోవడంతో షాపుల ముందు, రోడ్డు పక్కన నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. ఎండ, వర్షాల్లో ప్రయాణికుల కష్టాలు మరింత పెరుగుతున్నాయి. కనీస సౌకర్యాలు కరువు.. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు పాత బస్టాండ్‌కు ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే సరైన వేచిచోటు, కూర్చునే సదుపాయం, తాగునీరు, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక వసతులు అందుబాటులో లేకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలతో వచ్చే ప్రయాణికులు తీవ్ర...