స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చారిత్రాత్మకం అర్హులందరికీ సన్న బియ్యం పంపిణీ: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేరేడుచర్లలో మూడు మండలాల లబ్ధిదారులకు కార్డుల పంపిణీ
నేరేడుచర్ల, సెప్టెంబర్ 27, శుభోదయ డైనమిక్ వార్త నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకీడు మండలాల ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నేరేడుచర్లలోని ఎస్‌కేఎస్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించారు. తహసీల్దార్ సైదులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర పౌరసరఫరాలు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. సన్న బియ్యం పంపిణీ చరిత్రాత్మకం ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో అర్హులైన ప్రతి కుటుంబానికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ప్రభుత్వం ఈ...