అధికారుల కాళ్లు కడుగుతాం.. మా పంట పొలాలను కాపాడండి!ప్రజావాణిలో ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంపై వినూత్న నిరసన

కాలువల మరమ్మతులు, నీటి సరఫరా, ఆక్రమణల తొలగింపునకు డిమాండ్ కలెక్టర్ జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని తక్కెళ్ల నాగార్జున వినతి నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్ వార్త, సెప్టెంబర్ 28 నేరేడుచర్ల మండలం జానాలదిన్న గ్రామపంచాయతీ పరిధిలోని ఎన్ ఎస్ పీ కాలువల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బహుజన సామాజిక కార్యకర్త తక్కెళ్ల నాగార్జున ప్రజావాణిలో వినూత్న నిరసన తెలిపారు. ఇరిగేషన్ శాఖ అధికారుల పాదాలను కడిగి, సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు.తమ ప్రాంతంలోని ఇరిగేషన్ సమస్యలపై పలుమార్లు మౌఖికంగా, లిఖితపూర్వకంగా అధికారులకు ఫిర్యాదులు చేసినా సమస్యలు పరిష్కారం కాలేదని నాగార్జున తెలిపారు. కాలువల మరమ్మతులు, నీటి సరఫరా, ఆక్రమణల తొలగింపు, కాలువల...