హుస్సైనాబాద్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా ముగ్గురికి గాయాలు.. సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

మోతె,శుభోదయ డైనమిక్ వార్త, సెప్టెంబర్ 30 మండలంలోని హుస్సైనాబాద్ గ్రామ శివారులో బుధవారం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న మైత్రి ట్రావెల్స్‌కు చెందిన NL 01 B 5579 నంబర్ గల బస్సు హుస్సైనాబాద్ శివారులోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఎదురుగా రహదారి పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. అతివేగమే కారణమా? బస్సు డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడపడంతోనే వాహనం అదుపుతప్పినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ముగ్గురికి గాయాలు ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. స్థానికులు, అధికారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను అంబులెన్స్‌లో సూర్యాపేట...