హాజరు తగ్గితే చర్యలు తప్పవు: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 60 శాతంలోపు హాజరున్న పాఠశాలల హెచ్‌ఎంలకు నోటీసులు
ఎఫ్‌ఆర్‌ఎస్ నిబంధనలు పాటించకుంటే రెండు ఇంక్రిమెంట్లు నిలిపివేత ప్రాథమిక విద్యార్థులకు టాలెంట్ సెర్చ్ పరీక్షలు సూర్యాపేట బ్యూరో , సెప్టెంబర్ 30, శుభోదయ డైనమిక్ వార్త విధుల పట్ల అలసత్వం వహించే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ సెప్టెంబర్ మాస సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఎంఈవోలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, ఎఫ్‌ఎల్‌ఎన్, ఎల్‌ఐపీ ప్రగతి, అధికారుల తనిఖీలు, స్పాట్ అసెస్‌మెంట్, పీఎం శ్రీ పనులు, మధ్యాహ్న భోజనం, భవిత కేంద్రాల పనితీరుపై సమీక్షించారు. 69 శాతమే విద్యార్థుల హాజరు జిల్లాలో విద్యార్థుల సగటు హాజరు...