జిల్లావ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు అక్టోబర్ 31 వరకు నిబంధనలు అమల్లో ఉంటాయి ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు: ఎస్పీ నరసింహ

ముందస్తు అనుమతులు లేకుండా సభలు, ర్యాలీలు, ధర్నాలకు నిషేధం సూర్యాపేట బ్యూరో , అక్టోబర్ 2,శుభోదయ డైనమిక్ వార్త శాంతిభద్రతల పరిరక్షణతో పాటు జిల్లాలో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించేందుకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ తెలిపారు. ఈ నిబంధనలు అక్టోబర్ 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయని వెల్లడించారు. అనుమతులు తప్పనిసరి: 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున డీఎస్పీ లేదా అంతకంటే పైస్థాయి పోలీసు అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రజలు గుమిగూడే ఇతర కార్యక్రమాలను నిర్వహించరాదని ఎస్పీ సూచించారు. కార్యక్రమాల...