జర్నలిస్టులు, అడ్వకేట్లపై పోలీసుల వరుస విజయం..!

ముఖ్యమైన పాయింట్స్:గంజాయి నిర్మూలనకు మద్దతుగా నిర్వహించిన ఫ్రెండ్లీ క్రీడా పోటీల్లో పోలీసులు సత్తా చాటారు శుభోదయ డైనమిక్ న్యూస్ – హుజూర్‌నగర్: గంజాయి నిర్మూలనకు మద్దతుగా నిర్వహించిన ఫ్రెండ్లీ క్రీడా పోటీల్లో పోలీసులు సత్తా చాటారు. హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, అడ్వకేట్లు, పోలీసుల మధ్య నిర్వహించిన ఫ్రెండ్లీ క్రీడా పోటీల్లో జర్నలిస్టుల జట్టుపై, అనంతరం అడ్వకేట్ల జట్టుపై పోలీసులు విజయం సాధించి వరుసగా రెండు విజయాలను నమోదు చేశారు.హుజూర్‌నగర్ పట్టణంలోని ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో జర్నలిస్టులు–పోలీసుల జట్లు తలపడగా పోలీసుల జట్టు విజయం సాధించింది. అనంతరం అడ్వకేట్లు–పోలీసుల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ పోలీసులు గెలుపొందారు....