చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ సాధించుకుంటాం

ముఖ్యమైన పాయింట్స్:బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు హైదరాబాద్, అక్టోబర్ 5, శుభోదయ డైనమిక్ చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్ సాధించి తీరుతామని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు స్పష్టం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు ఎవరి దయాదాక్షిణ్యాలతో ఇచ్చేవి కావని, ఇది తమ హక్కు అని పేర్కొన్నారు.ఆదివారం నారాయణగూడలోని సత్యనారాయణ రెడ్డి భవన్‌లో జరిగిన బీసీ హక్కుల సాధన సమితి హైదరాబాద్ జిల్లా మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న అస్తిత్వ, ప్రజా ఉద్యమాలు విజయవంతమవుతాయని, ప్రజా ఉద్యమాలు ఎన్నడూ విఫలం కాలేదని...