ఎల్‌నినో ప్రభావం ఉన్నా నీటి వృథా ఎలా? ప్రజలకు పొదుపు సూచనలు.. అధికారుల కళ్ల ముందే వారం రోజులుగా పైప్‌లైన్ లీకేజీ!
ముఖ్యమైన పాయింట్స్:ఎల్‌నినో ప్రభావం ఉన్నా నీటి వృథా ఎలా?ప్రజలకు పొదుపు సూచనలు.. అధికారుల కళ్ల ముందే వారం రోజులుగా పైప్‌లైన్ లీకేజీ! నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్ న్యూస్ ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీటి ప్రతి బొట్టును పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. భూగర్భ జలాలను పరిరక్షించాలని, తాగునీటిని వృథా చేయవద్దని మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన నాగరాజు సైతం పిలుపునిచ్చారు. అయితే మరోవైపు నేరేడుచర్ల పట్టణంలో అధికారుల కళ్ల ముందే గత వారం రోజులుగా తాగునీరు వృథాగా పోతుండటం చర్చనీయాంశంగా మారింది. పైప్‌లైన్ లీకేజీ.. నీరు ఎన్‌ఎస్పీ కాలువలోకి నేరేడుచర్ల పట్టణంలోని ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల ప్రధాన రహదారి పక్కన, ఎంఈఓ కార్యాలయానికి...