ప్రణాళికాబద్ధమైన దర్యాప్తుతోనే బాధితులకు సత్వర న్యాయం కేసులను సకాలంలో పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ కె. నరసింహ
ముఖ్యమైన పాయింట్స్:ప్రణాళికాబద్ధమైన దర్యాప్తుతోనే బాధితులకు సత్వర న్యాయంకేసులను సకాలంలో పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ కె. నరసింహ సూర్యాపేట బ్యూరో , అక్టోబర్ 10, శుభోదయ డైనమిక్ వార్త: కేసుల దర్యాప్తులో పటిష్ఠ ప్రణాళికతో ముందుకు సాగుతూ, చట్ట నిబంధనలను పాటించి నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఎస్పీ పలు సూచనలు చేశారు. కేసుల నమోదు నుంచి దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేసే వరకు...