మంటల్లో చిక్కుకున్న ఐదుగురిని కాపాడిన మిర్యాలగూడ పోలీసులు సమయస్ఫూర్తితో స్పందించి కుటుంబ సభ్యులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన సిబ్బంది

ముఖ్యమైన పాయింట్స్:మంటల్లో చిక్కుకున్న ఐదుగురిని కాపాడిన మిర్యాలగూడ పోలీసులుసమయస్ఫూర్తితో స్పందించి కుటుంబ సభ్యులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన సిబ్బంది శుభోదయ డైనమిక్ న్యూస్ – నల్లగొండ బ్యూరో, అక్టోబర్ 11 నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఇస్లాంపుర ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చెప్పుల దుకాణం ఉన్న భవనంలో మంటలు చెలరేగడంతో పై అంతస్తుల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దట్టమైన పొగ వ్యాపించడంతో బయటకు వచ్చే మార్గం లేక ఐదుగురు కుటుంబ సభ్యులు భవనంలో చిక్కుకుపోయారు.సమాచారం అందుకున్న మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసు సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమయస్ఫూర్తితో స్పందించి భవనంలో చిక్కుకున్న ఐదుగురు కుటుంబ సభ్యులను...