నల్లగొండలో రూ.75 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు రెండు ప్రధాన రహదారుల విస్తరణ, బలోపేతానికి శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ముఖ్యమైన పాయింట్స్:నల్లగొండలో రూ.75 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులురెండు ప్రధాన రహదారుల విస్తరణ, బలోపేతానికి శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభోదయ డైనమిక్ న్యూస్ – నల్లగొండ బ్యూరో, అక్టోబర్ 11 నల్లగొండ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. కనగల్ మండల పరిధిలో రెండు ప్రధాన రహదారుల విస్తరణ, బలోపేతం పనులకు మొత్తం రూ.75 కోట్ల అంచనా వ్యయంతో ఆయన శంకుస్థాపన చేశారు. రూ.41 కోట్లతో రహదారి అభివృద్ధి కనగల్ మండలం తేలకంటిగూడెం మీదుగా తోరగల్ నుంచి నల్లగొండ మండలం ముషంపల్లి వరకు రూ.41 కోట్ల...