టైలర్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా మరోసారి బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక దర్జీ వృత్తిదారులకు ప్రభుత్వం అండగా నిలవాలి
ముఖ్యమైన పాయింట్స్:టైలర్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా మరోసారి బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఎన్నికదర్జీ వృత్తిదారులకు ప్రభుత్వం అండగా నిలవాలి శుభోదయ డైనమిక్ న్యూస్ – నేరేడుచర్ల, అక్టోబర్ 11 నేరేడుచర్ల పట్టణ టైలర్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా బత్తిని శ్రీనివాస్ గౌడ్ మరోసారి ఎన్నికయ్యారు. ఆదివారం నేరేడుచర్లలో నిర్వహించిన యూనియన్ సమావేశంలో ఆయనను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రెడీమేడ్ దుస్తుల వినియోగం పెరగడంతో సంప్రదాయ దర్జీ వృత్తి క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దర్జీ వృత్తిదారులకు రుణ సదుపాయాలు కల్పిస్తే స్థానికంగానే రెడీమేడ్...