కలెక్టర్ ఆదేశాలకూ దిక్కులేదు! ఫిర్యాదు చేసినా కదలని అధికారులు.. చీదెళ్ల పెద్ద చెరువు నీరు ఖాళీ!

ముఖ్యమైన పాయింట్స్:కలెక్టర్ ఆదేశాలకూ దిక్కులేదు!ఫిర్యాదు చేసినా కదలని అధికారులు.. చీదెళ్ల పెద్ద చెరువు నీరు ఖాళీ!మోటార్లు తొలగించలేదు.. క్షేత్రస్థాయిలో పరిశీలన లేదు!సాగునీరు లేక పేద రైతుల అవస్థలు.. తాగునీటికీ ముప్పు! శుభోదయ డైనమిక్ న్యూస్ – సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్, అక్టోబర్ 11 చెరువులో నీటిని యథేచ్ఛగా తోడేస్తున్నారనే ఆరోపణలు.. రైతుల ఫిర్యాదులు.. సమస్య పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌కు విన్నపం.. అయినా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మారలేదు. చీదెళ్ల పెద్ద చెరువులో నీటిని తోడేందుకు ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మోటార్లను తొలగించకపోవడం, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకపోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించకపోతే తమ సమస్యలు ఎవరికి...