బూరుగడ్డ పీఏసీఎస్‌ చైర్మన్‌ పదవి బూరుగడ్డకే ఇవ్వాలి! 20 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నా గుర్తింపు లేదా?

ముఖ్యమైన పాయింట్స్:బూరుగడ్డ పీఏసీఎస్‌ చైర్మన్‌ పదవి బూరుగడ్డకే ఇవ్వాలి!20 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నా గుర్తింపు లేదా? శుభోదయ డైనమిక్ న్యూస్ – హుజూర్‌నగర్‌ రూరల్ బూరుగడ్డ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) చైర్మన్‌ పదవిని బూరుగడ్డ గ్రామానికే కేటాయించాలని ఐదు గ్రామాలకు చెందిన రైతులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. గతంలో కొనసాగిన ఆనవాయితీని గౌరవించాలని కోరారు.సుమారు 20 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ కోసం పనిచేస్తున్నా పదవుల ఎంపికలో తగిన గుర్తింపు లభించడం లేదని బూరుగడ్డ గ్రామ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఒక అభ్యర్థిని చూపించి, అనంతరం మరొకరితో ప్రమాణ స్వీకారం చేయించడం వెనుక ఉద్దేశమేమిటని ప్రశ్నించారు.కార్యకర్తల అభిప్రాయాలను...