కెపిహెచ్‌బీలో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు

ముఖ్యమైన పాయింట్స్:కెపిహెచ్‌బీలో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు శుభోదయ డైనమిక్ న్యూస్ – మేడ్చల్–మల్కాజిగిరి, అక్టోబర్ 12 కెపిహెచ్‌బీ ఎల్‌ఐజీ 22, 23 ప్రాంతాల్లో మురుగునీటి సమస్యలను పరిష్కరించాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మాజీ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుతో కలిసి సోమవారం ఆయన ప్రాంతంలో పర్యటించి సమస్యలను పరిశీలించారు.డ్రైనేజీ సమస్యలపై వాటర్ వర్క్స్ అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా, ప్రజారోగ్యానికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.