హుజూర్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం బస్సు ఢీకొని రిక్షా కార్మికుడు మృతి

ముఖ్యమైన పాయింట్స్:హుజూర్‌నగర్‌లో రోడ్డు ప్రమాదంబస్సు ఢీకొని రిక్షా కార్మికుడు మృతి హుజూర్‌నగర్, అక్టోబర్ 13 – శుభోదయ డైనమిక్ న్యూస్: హుజూర్‌నగర్ పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రిక్షా కార్మికుడు రమణయ్య (70) మృతి చెందారు. రోజువారీ పనిలో భాగంగా రిక్షాపై ఉల్లిగడ్డల బస్తా తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.హుజూర్‌నగర్‌కు చెందిన రమణయ్య రోడ్డు దాటుతుండగా నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ పాఠశాలకు చెందిన బస్సు ఆయన రిక్షాను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమణయ్య అక్కడికక్కడే మృతి చెందారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సుతో...