చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసంపై ఆగ్రహం 24 గంటల్లో నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలి
ముఖ్యమైన పాయింట్స్:చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసంపై ఆగ్రహం24 గంటల్లో నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలి సూర్యాపేట బ్యూరో, శుభోదయ డైనమిక్ వార్త మెదక్ జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని రజక సంక్షేమ సంఘం రాష్ట్ర పొలిట్బ్యూరో సభ్యుడు చిలకరాజు శ్రీను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి అని ఆయన అన్నారు. మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భూమి, భుక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మహనీయుల విగ్రహాలకే రక్షణ...