ఘనంగా శ్రీ షిరిడీ సాయిబాబా మందిర శిఖర ప్రతిష్ఠ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, హోమాలు
ముఖ్యమైన పాయింట్స్:ఘనంగా శ్రీ షిరిడీ సాయిబాబా మందిర శిఖర ప్రతిష్ఠ మహోత్సవంభక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, హోమాలు నడిగూడెం, శుభోదయ డైనమిక్ వార్త | అక్టోబర్ 13: నడిగూడెంలోని శ్రీ షిరిడీ సాయిబాబా మందిరంలో శిఖర ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు మంగళవారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో విశ్వేశ్వర పూజ, పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన, ప్రధాన కలశాధారణ, జలాధివాసం, ధాన్యాధివాసం, మూలమంత్ర హోమం తదితర పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఆలయ అర్చకులు రాజశేఖర్ శర్మ ఆధ్వర్యంలో అర్చక బృందం వేదమంత్రోచ్ఛారణల నడుమ పూజలు, హోమాలు నిర్వహించింది. పలువురు దంపతులు పూజా పీఠాలపై కూర్చొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.మహోత్సవంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు...