నిమ్మ తోటల యాజమాన్యంపై రైతులకు శిక్షణ అధిక దిగుబడులు, నాణ్యమైన పండ్ల ఉత్పత్తికి శాస్త్రీయ పద్ధతులు పాటించాలి
ముఖ్యమైన పాయింట్స్:నిమ్మ తోటల యాజమాన్యంపై రైతులకు శిక్షణఅధిక దిగుబడులు, నాణ్యమైన పండ్ల ఉత్పత్తికి శాస్త్రీయ పద్ధతులు పాటించాలి నడిగూడెం శుభోదయ డైనమిక్ వార్త | అక్టోబర్ 13 నడిగూడెం: సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం చెన్నకేశవపురం గ్రామంలో నిమ్మ తోటల సమగ్ర యాజమాన్య పద్ధతులపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సిరి ఫౌండేషన్, కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే), గడ్డిపల్లి, ఉద్యాన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రైతు తంగెళ్ల చంద్రయ్య నిమ్మ తోటలో ఈ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గోసుల రాజేష్ అధ్యక్షత వహించగా, జిల్లా ఉద్యాన శాఖాధికారి టీ. నాగయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండల వ్యవసాయ అధికారి మల్సూర్, ఉద్యాన...