ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై తాజా అప్డేట్ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైన రాష్ట్ర ఎన్నికల సంఘం.. నోటిఫికేషన్పై ఉత్కంఠ!
ముఖ్యమైన పాయింట్స్:ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై తాజా అప్డేట్ఎన్నికల నిర్వహణకు సిద్ధమైన రాష్ట్ర ఎన్నికల సంఘం.. నోటిఫికేషన్పై ఉత్కంఠ! అమరావతి, అక్టోబర్ 14 (శుభోదయ డైనమిక్ న్యూస్) ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమవుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు రాష్ట్రంలోని 106 మున్సిపాలిటీల చైర్పర్సన్ పదవులు, 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. దీంతో ఆయా స్థానాల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు, రాజకీయ పార్టీలు...