ఆర్టీఐ అమలులో రాష్ట్రస్థాయిలో ఉత్తమ జిల్లాగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌కు ఎస్పీ నరసింహ అభినందనలు
ముఖ్యమైన పాయింట్స్:ఆర్టీఐ అమలులో రాష్ట్రస్థాయిలో ఉత్తమ జిల్లాగా సూర్యాపేటజిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌కు ఎస్పీ నరసింహ అభినందనలు సూర్యాపేట, శుభోదయ డైనమిక్ వార్త | అక్టోబర్ 14 సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)–2005 అమలులో రాష్ట్రస్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాగా సూర్యాపేట గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌ను జిల్లా ఎస్పీ కె. నరసింహ బుధవారం కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంతో పాటు సమాచార హక్కు చట్టం...