Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

భారత్ టాక్సీతో కేంద్రం కొత్త అడుగుఉబర్, ఓలా తరహాలో సేవలు — వచ్చే నెలలో ఢిల్లీలో ప్రారంభం

Author
Posted By DAINAMIC NEWS
| 25 Oct 2025, 02:00 AM | జాతీయం
భారత్ టాక్సీతో కేంద్రం కొత్త అడుగుఉబర్, ఓలా తరహాలో సేవలు — వచ్చే నెలలో ఢిల్లీలో ప్రారంభం


న్యూ ఢిల్లీ, డైనమిక్ డెస్క్, అక్టోబర్ 25



దేశంలో ప్రైవేట్ క్యాబ్ సర్వీసులకు పోటీగా కేంద్ర ప్రభుత్వం ‘భారత్ టాక్సీ’ సేవలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. వచ్చే నెలలో ఢిల్లీలో ఈ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఉబర్, ఓలా వంటి క్యాబ్ సంస్థలు ప్రతి ప్రయాణం పై 25 శాతం వరకూ కమిషన్ వసూలు చేస్తుంటే, భారత్ టాక్సీ ప్లాట్‌ఫారమ్‌లో డ్రైవర్లు నెలవారీ నామమాత్రపు రుసుము మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో డ్రైవర్లకు ఆర్థికంగా మేలు జరగనుంది.సాంకేతికత ఆధారిత ఈ సేవ ద్వారా ప్రజలకు తక్కువ ధరలో విశ్వసనీయ ప్రయాణ సౌకర్యం లభించనుందని అధికారులు తెలిపారు.ఢిల్లీలో సేవలు విజయవంతమైతే డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి.



ప్రధానాంశాలు

ఇవి కూడా చదవండి




  • వచ్చే నెలలో ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ప్రారంభం


  • ప్రైవేట్ క్యాబ్‌ల మాదిరిగా కమిషన్ విధానం ఉండదు


  • డ్రైవర్లకు నెలవారీ నామమాత్రపు ఫీజు


  • డిసెంబర్‌లో దేశవ్యాప్త విస్తరణకు అవకాశం