Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఉరేసుకుని మహిళా లెక్చరర్ ఆత్మహత్య

Author
Posted By DAINAMIC NEWS
| 25 Oct 2025, 08:46 PM | ఆంధ్ర ప్రదేశ్
ఉరేసుకుని మహిళా లెక్చరర్ ఆత్మహత్య


డైనమిక్,కడప జిల్లా, అక్టోబర్ 26



కడప జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మానసికంగా కుంగిపోయిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పొద్దుటూరు పట్టణంలోని ఈశ్వర్‌రెడ్డి నగర్‌లో ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది.మహేశ్వరి (26) అనే యువతి చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి, తాత వద్ద అక్క కవితతో కలిసి పెరిగింది. ఇటీవల అక్క వివాహం కాగా, మహేశ్వరి తాతతోనే ఉంటూ ఆయనను చూసుకుంటూ చాపాడు మండలంలోని ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తోంది.అక్క వివాహం తర్వాత ఒంటరితనం, కుటుంబ బాధలు, మానసిక వేదనలతో బాధపడిన మహేశ్వరి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సూచన అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్క కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి