Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఓటరు జాబితా సవరణను సమర్థవంతంగా చేపట్టాలి – రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

Author
Posted By DAINAMIC NEWS
| 01 Nov 2025, 09:42 AM | తాజా సమాచారం
ఓటరు జాబితా సవరణను సమర్థవంతంగా చేపట్టాలి – రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి


డైనమిక్,సూర్యాపేట బ్యూరో, నవంబర్ 1



రాష్ట్రవ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్‌



ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను వేగవంతంగా, సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు సూచించారు.నివారం ఆయన హైదరాబాద్‌ నుండి రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఈఆర్‌ఓలతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–2025 పురోగతిని సమీక్షించారు.



ఓటర్లను నాలుగు కేటగిరీలుగా విభజన



సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గాల వారీగా ఓటర్లను నాలుగు కేటగిరీలుగా విభజించామని తెలిపారు.కేటగిరీ A – 1987 కంటే ముందు జన్మించి 2002, 2025 ఓటరు జాబితాల్లో నమోదు అయిన వారు. కేటగిరీ B – 1987 కంటే ముందు జన్మించి 2002 జాబితాలో లేకుండా 2025 జాబితాలో నమోదు కాబడిన వారు.కేటగిరీ C – 1987 నుండి 2002 మధ్య జన్మించి 2025 జాబితాలో నమోదు కాబడిన వారు,కేటగిరీ D – 2002 నుండి 2007 మధ్య జన్మించిన ఓటర్లు.



63 లక్షల ఓటర్ల ధృవీకరణ పూర్తయింది



మొదట కేటగిరీ A జాబితాను బి‌ఎల్‌ఓ యాప్‌ ద్వారా నిర్ధారిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 63 లక్షల ఓటర్ల వివరాలు ధృవీకరించబడ్డాయని సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.మిగిలిన 12 లక్షల ఓటర్ల ధృవీకరణను త్వరగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. కేటగిరీ C, D లోని ఓటర్లను కేటగిరీ A కు మ్యాపింగ్ చేసే ప్రక్రియను మెరుగుపరచాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి



ఫారమ్‌లు 6, 7, 8 పరిశీలన వేగవంతం చేయాలి



ఓటర్ లిస్టులకు సంబంధించిన ఫారమ్‌లు 6, 7, 8 ఎంక్వయిరీని త్వరితగతిన పూర్తి చేసి, ఏడు రోజుల్లో నివేదికలు సమర్పించాలని అన్ని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.



ప్రతి పోలింగ్ కేంద్రంలో బి‌ఎల్‌ఓల నియామకం



ప్రతి పోలింగ్ కేంద్రంలో బి‌ఎల్‌ఓలను నియమించి, వారు యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు ఓటర్ల వివరాలను నమోదు చేయాలని ఆయన సూచించారు.



సమావేశంలో పాల్గొన్న అధికారులు



ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజాస్ నంద్‌లాల్ పవార్, కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ, హుజూర్నగర్ ఆర్డీవో శ్రీనివాసులు, సూర్యాపేట ఎమ్మార్వో కృష్ణయ్య, కలెక్టరేట్ పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, సూపరింటెండెంట్ సంతోష్ కిరణ్, ఎలక్షన్ డీటీ వేణు తదితరులు పాల్గొన్నారు.