Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఏపీటీఎఫ్ నూతనకార్యవర్గం ఎన్నిక కారంపూడి మండలంలో ఘనంగా సమావేశం నిర్వహణ

Author
Posted By DAINAMIC NEWS
| 05 Nov 2025, 05:42 AM | ఆంధ్ర ప్రదేశ్
ఏపీటీఎఫ్ నూతనకార్యవర్గం ఎన్నిక కారంపూడి మండలంలో ఘనంగా సమావేశం నిర్వహణ


డైనమిక్,కారంపూడి, నవంబర్ 5



మండల కేంద్రంలోని ఇందిరా నగర్ కాలనీలో గల ఎంపీపీ పాఠశాల ఆవరణలో బుదవారం కారంపూడి మండల ఏపీటీఎఫ్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండల ఏపీటీఎఫ్ అధ్యక్షులు వి. వెంకటేశ్వర్లు నాయక్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమాలను గుర్తుచేశారు. ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణకు ఏపీటీఎఫ్ అంకితభావంతో పనిచేస్తోందని తెలిపారు.



నూతన కార్యవర్గం ఎన్నిక



తదుపరి సమావేశంలో మండల ఏపీటీఎఫ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందులో



.జి. భాస్కరరావు – మండల అధ్యక్షుడు



వి. వెంకటేశ్వర్లు నాయక్ – ప్రధాన కార్యదర్శి



టి. వెంకటేశ్వరమ్మ – మహిళా కార్యదర్శి

ఇవి కూడా చదవండి



యం.డి. షకీల్ అహ్మద్, షెక్ రబ్బానీ – ఉపాధ్యక్షులుగా ఎంపికయ్యారు.



ఎన్నికల ప్రక్రియను పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.వి. రవి కుమార్ ఎన్నికల అధికారిగా నిర్వహించారు.



చురుకుగా సేవలందించాలన్న పిలుపు



ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కౌన్సిలర్ ఐ. విజయలక్ష్మి నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరించి, సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది.



కార్యక్రమంలో పాల్గొన్నవారు



ఈ కార్యక్రమంలో మండల కార్యకర్తలు కుటుంబరావు, జి. ఆంజనేయులు, బి. బాబు నాయక్, కె. పుల్లమ్మ, రవి కిరణ్, నాగేశ్వరరావు, మరియాదాసు, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.