Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఒప్పిచర్లలో చెంచు వర్గ సంక్షేమంపై అధికారుల సమీక్ష పిఎం జన్మన్ పథకం అమలుపై విభాగాల సమన్వయ సమావేశం

Author
Posted By DAINAMIC NEWS
| 05 Nov 2025, 10:44 AM | ఆంధ్ర ప్రదేశ్
ఒప్పిచర్లలో చెంచు వర్గ సంక్షేమంపై అధికారుల సమీక్ష పిఎం జన్మన్ పథకం అమలుపై విభాగాల సమన్వయ సమావేశం


డైనమిక్ ,కారంపూడి, నవంబర్ 5



కారంపూడి మండలంలోని ఒప్పిచర్ల గ్రామపంచాయతీ పరిధిలో చెంచు వర్గానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు సమర్థవంతంగా అందే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.



విభాగాల సమన్వయంపై చర్చ



ఈ నేపథ్యంలో బుదవారం మండలంలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్న సమావేశం ఒప్పిచర్ల పంచాయతీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో చెంచులకు పిఎం జన్మన్ పథకం కింద అందవలసిన ప్రయోజనాలు, అలాగే ఇతర అభివృద్ధి, సంక్షేమ పథకాలు గురించి చర్చ జరిగింది.


ఇవి కూడా చదవండి


అధికారుల హాజరు



సమావేశానికి డిటిడబ్ల్యువో అమరా వెంకటసుబ్బయ్య, ఎంపీడీవో గంట శ్రీనివాసరెడ్డి, ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు నాయక్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నాగేశ్వరరావు, ఎంఈఓ, సిహెచ్ఓ మల్లయ్య, విద్యుత్ శాఖ జేఈ, హౌసింగ్ ఏఈ బాబురావు, ఏపీఓ కే. నాగేశ్వరరావు, ఏపీఎం తదితరులు హాజరయ్యారు.ఈ సమావేశానికి ఒప్పిచర్ల సర్పంచ్ శ్రీమతి గంగనపల్లి పుష్పలత అధ్యక్షత వహించారు. గ్రామస్థాయిలో చెంచు వర్గ అభివృద్ధికి సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు.



పథకాలు అందరికీ చేరేలా కృషి



ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఒక్క చెంచు కుటుంబం కూడా మిగిలిపోకుండా అందరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ప్రతిజ్ఞ చేశారు.