Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కారంపూడి ఎంపీపీ పదవి టీడీపీ ఖాతాలోకి ఏకగ్రీవంగా బొల్లినేడి కనకదుర్గ–శ్రీనివాసరావు ఎన్నిక

Author
Posted By DAINAMIC NEWS
| 04 Feb 2026, 02:52 AM | ఆంధ్ర ప్రదేశ్
కారంపూడి ఎంపీపీ పదవి టీడీపీ ఖాతాలోకి ఏకగ్రీవంగా బొల్లినేడి కనకదుర్గ–శ్రీనివాసరావు ఎన్నిక


కారంపూడి, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 4



కారంపూడి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. పల్నాడు జిల్లా ఇండస్ట్రీ ఎడి, ఎన్నికల అధికారి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో టీడీపీకి చెందిన వేపకంపల్లి ఎంపీటీసీ సభ్యులు బొల్లినేడి కనకదుర్గ, శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నికయ్యారు.



మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ



మధ్యాహ్నం 12 గంటలకు పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. కూటమి నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై బొల్లినేడి కనకదుర్గ, శ్రీనివాసరావు నామినేషన్లు దాఖలు చేయించారు.



ఇతర నామినేషన్లు లేకపోవడంతో ఏకగ్రీవం


ఇవి కూడా చదవండి


నిర్దేశిత గడువు ముగిసే వరకు మరే ఇతర అభ్యర్థులు నామినేషన్లు వేయకపోవడంతో, 11 మంది ఎంపీటీసీ సభ్యులు మద్దతు తెలపగా గాదేవారిపల్లి ఎంపీటీసీ సైదా రెడ్డి బలపరిచారు. దీంతో ఎన్నికల అధికారి నవీన్ కుమార్ బొల్లినేడి కనకదుర్గ, శ్రీనివాసరావులను ఎంపీపీగా అధికారికంగా ప్రకటించారు.



ఎన్నిక పత్రం అందజేత



ఎన్నికల అనంతరం నవీన్ కుమార్ చేతుల మీదుగా నూతన ఎంపీపీకి ఎన్నిక పత్రాన్ని అందజేశారు.



కూటమి నేతల అభినందనలు



ఈ సందర్భంగా పంగులూరి అంజయ్య, పంగులూరి పుల్లయ్య, మునుగోటి సత్యం, గోళ్ళ సురేష్ యాదవ్, చప్పిడి రాము, ఉన్నం లక్ష్మీనారాయణ, కటికల బాలకృష్ణ, తండా మస్తాన్ జానీ, చావా వీరాంజనేయులు, నాగవరపు రామకృష్ణ, బాలు నాయక్, బొమ్మెన శేషగిరి, దోర్నాల బ్రహ్మారెడ్డి, మాదల శ్రీహరి తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.