Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పౌర హక్కులను సద్వినియోగం చేసుకోవాలిసర్పంచ్ దోసపాటి అనురాధ పిలుపు

Author
Posted By DAINAMIC NEWS
| 28 Feb 2026, 05:10 AM | తాజా సమాచారం
పౌర హక్కులను సద్వినియోగం చేసుకోవాలిసర్పంచ్ దోసపాటి అనురాధ పిలుపు


డైనమిక్ న్యూస్, మోతే, ఫిబ్రవరి 28



ప్రజలందరూ తమకు కల్పించిన పౌర హక్కులను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ దోసపాటి అనురాధ సూచించారు. మోతే గ్రామపంచాయతీ ఆవరణలో శుక్రవారం పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు.



కుల వివక్ష నిర్మూలనపై దృష్టి


ఇవి కూడా చదవండి


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో కుల వివక్ష, అంటరానితనం వంటి అనర్థాలను పూర్తిగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. అన్ని కులాలు, వర్గాల ప్రజలు స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావంతో మెలగాలని కోరారు.



హక్కులపై అవగాహన అవసరం



పౌర హక్కులపై ప్రజలకు సరైన అవగాహన ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్నారు. హక్కులు తెలుసుకోవడం మాత్రమే కాకుండా వాటిని బాధ్యతతో వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి కవిత, హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్, జీపీఓ సైదులు, ఉప సర్పంచ్ బొక్క ఉపేందర్ రెడ్డి, వార్డు మెంబర్ దోసపాటి రాము, గ్రామపంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.