Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సూర్యాపేట జిల్లా పోలీస్ ప్రజావాణి – ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం

Author
Posted By DAINAMIC NEWS
| 23 Mar 2026, 04:25 AM | తాజా సమాచారం
సూర్యాపేట జిల్లా పోలీస్ ప్రజావాణి – ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం


సూర్యాపేట బ్యూరో, మార్చి 23, డైనమిక్ న్యూస్



జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె. నరసింహ ప్రజల సమస్యలను స్వయంగా విన్నారు.



పిర్యాదుల స్వీకరణ – వెంటనే స్పందన



జిల్లా నలుమూలల నుండి వచ్చిన పిర్యాదుదారుల నుండి వివిధ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యల తీవ్రతను గుర్తించి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా వెంటనే ఆదేశాలు జారీ చేసి, తక్షణ పరిష్కారానికి దిశానిర్దేశం చేశారు.



చట్టపర చర్యలకు ప్రాధాన్యత


ఇవి కూడా చదవండి


ప్రజల సమస్యలపై త్వరితగతిన చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు. ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతతో పరిశీలించాలని అధికారులకు సూచించారు.



పైరవీలు లేకుండా సేవలు పొందండి



ప్రజలు ఎలాంటి సమస్యలకైనా పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.



ప్రజలకు చేరువగా పోలీస్ శాఖ



చట్టబద్ధ విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు.