Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలేపాలకవీడు మండల కేంద్రంలో 199వ జయంతి వేడుకలు ఘనంగా

Author
Posted By DAINAMIC NEWS
| 11 Apr 2026, 05:51 AM | తాజా సమాచారం
అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలేపాలకవీడు మండల కేంద్రంలో 199వ జయంతి వేడుకలు ఘనంగా


పాలకవీడు, శుభోదయ డైనమిక్ వార్త,ఏప్రిల్ 11



సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల పురోగతికి విశేషంగా కృషి చేసిన మహానుభావుడని బీసీ హక్కుల సాధన సమితి మండల అధ్యక్షుడు గొర్రె శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.



చిత్రపటానికి పూలమాలలు అర్పణ



ఈ సందర్భంగా నాయకులు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.



సామాజిక అసమానతలపై నిరంతర పోరాటం



గొర్రె శ్రీనివాస్ మాట్లాడుతూ, అంటరానితనాన్ని ఖండిస్తూ సామాజిక అసమానతలపై అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే అని కొనియాడారు. అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.


ఇవి కూడా చదవండి


మహిళా విద్యకు పునాది



మహిళా విద్యాభివృద్ధికి పూలే వేసిన పునాదులు సమాజానికి ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. బాలికల విద్యకు ప్రాధాన్యతనిస్తూ సమాన సమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడని వివరించారు.



పూలే ఆశయాల సాధనకు పిలుపు



ప్రస్తుత కాలంలో మహిళలకు నిజమైన స్వేచ్ఛ కల్పించడం, గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు పేద ప్రజలకు విద్య, వైద్యం, జీవనోపాధి అవకాశాలు అందించడం ద్వారా పూలేకు నిజమైన నివాళి అర్పించవచ్చని ఆయన పిలుపునిచ్చారు.



కార్యక్రమంలో పాల్గొన్నారు



ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ్ల ధనుంజయ నాయుడు, బీసీ సంఘం నాయకులు బొల్లగాని సుబ్బు గౌడ్, పేరూరి నాగయ్య, పెరుమాళ్ల సతీష్, దొంగల వెంకటయ్య, కొండ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ నరసింహ, బుర్రి చంద్రయ్య, కొండ యల్లయ్య, కొమర్రాజు వెంకట్, వీరబాబు, సైదులు తదితరులు పాల్గొన్నారు.