Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

హుజూర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

Author
Posted By DAINAMIC NEWS
| 08 May 2026, 12:05 AM | తాజా సమాచారం
హుజూర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి


శుభోదయ డైనమిక్ న్యూస్, హుజూర్‌నగర్,



హుజూర్‌నగర్ పట్టణంలోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాల సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గోవిందపురం గ్రామానికి చెందిన రాయిరాల రవి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.సమాచారం ప్రకారం, రాయిరాల రవి మరో వ్యక్తితో కలిసి స్కూటీపై వెళ్తుండగా డివైడర్ క్రాస్ చేసే సమయంలో హుజూర్‌నగర్ బస్టాండ్ నుంచి కోదాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ డీలక్స్ బస్సు స్కూటీని ఢీకొట్టింది.


ఇవి కూడా చదవండి


స్కూటీపై వెళ్తుండగా ప్రమాదం.. మరో వ్యక్తికి స్వల్ప గాయాలు



ఈ ప్రమాదంలో స్కూటీ వెనుక కూర్చున్న రవికి తలకు తీవ్ర గాయాలు కావడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు.స్కూటీ నడుపుతున్న వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.