Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి నేటి పర్యటన వివరాలు బూరుగడ్డలో పూజలు.. నారాయణపురంలో పల్లె దవాఖాన ప్రారంభం.. కోదాడలో వివాహానికి హాజరు.. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Author
Posted By DAINAMIC NEWS
| 03 Jul 2026, 09:43 PM | తాజా సమాచారం
కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి నేటి పర్యటన వివరాలు బూరుగడ్డలో పూజలు.. నారాయణపురంలో పల్లె దవాఖాన ప్రారంభం.. కోదాడలో వివాహానికి హాజరు.. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ


కోదాడ, జూలై 4, శుభోదయ డైనమిక్ వార్త



కోదాడ ఎమ్మెల్యే శ్రీమతి పద్మావతి రెడ్డి శనివారం పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులతో కలిసి పలు అభివృద్ధి, ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.



బూరుగడ్డలో హనుమాన్ స్వామి పూజలు



ఉదయం 11:30 గంటలకు హుజూర్‌నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలో నిర్వహించే దివ్య సుందర కార్యసిద్ధి హనుమాన్ స్వామి పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొంటారు.



నారాయణపురంలో పల్లె దవాఖాన ప్రారంభం


ఇవి కూడా చదవండి


మధ్యాహ్నం 12:00 గంటలకు చిలుకూరు మండలం నారాయణపురం గ్రామంలో టీజీఎంఎస్‌ఐడీసీ (TGMSIDC) నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖాన నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు.



వివాహ వేడుకకు హాజరు



మధ్యాహ్నం 12:30 గంటలకు కోదాడలోని పురమ రంగారావు ఫంక్షన్ హాల్‌లో బొప్పిడి సువార్త వెంకటేశ్వర్లు కుమార్తె వివాహ వేడుకకు ఎమ్మెల్యే హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు.



సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ



మధ్యాహ్నం 3:00 గంటలకు కోదాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.ఈ కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు