Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన ప్రిన్సిపల్‌గా పూసం నీరజ

Author
Posted By DAINAMIC NEWS
| 06 Jul 2026, 03:49 AM | తాజా సమాచారం
నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన ప్రిన్సిపల్‌గా పూసం నీరజ


నేరేడుచర్ల, జూలై 6,శుభోదయ డైనమిక్ వార్త



నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్‌గా పూసం నీరజ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా, ఎఫ్‌ఏసీ (FAC) ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహించిన ఆమె ఇటీవల పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఇంచార్జి ప్రిన్సిపల్ పి. వెంకటరమణ నుంచి బాధ్యతలను స్వీకరించారు.



ఘనంగా సన్మానం


ఇవి కూడా చదవండి


నూతన ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టిన పూసం నీరజను రాష్ట్ర జీజేఎల్‌ఏ (GJLA) అధ్యక్షులు, ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ డాక్టర్ పి. మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర ప్రిన్సిపల్స్ సంఘం గౌరవాధ్యక్షులు కేఎస్ రామారావు, సంఘ నాయకులు శేషుబాబు, పి. శంకర్, జీజేఎల్‌ఏ నాయకులు ఖుర్షీద్ హమ్మద్, ప్రమీల, వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్ పవన్, గీతాబాయి, నాగేశ్వరరావు, విజయలక్ష్మి, ధనమ్మ, నవీన జ్యోతి, జీజేఎల్‌ఏ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ మద్దిమడుగు సైదులు, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.



విద్యాభివృద్ధికి కృషి



ఈ సందర్భంగా కళాశాల అభివృద్ధి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు సమష్టిగా కృషి చేస్తానని నూతన ప్రిన్సిపల్ పూసం నీరజ తెలిపారు.