Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మేడారంలో ఫుడ్ స్టోరేజ్ భవనానికి శంకుస్థాపన ప్రజలకు మెరుగైన నిల్వ సౌకర్యాలే లక్ష్యం

Author
Posted By DAINAMIC NEWS
| 23 Jul 2026, 05:59 AM | తాజా సమాచారం
మేడారంలో ఫుడ్ స్టోరేజ్ భవనానికి శంకుస్థాపన ప్రజలకు మెరుగైన నిల్వ సౌకర్యాలే లక్ష్యం


నేరేడు చర్ల, శుభోదయ డైనమిక్ వార్త, జులై 23



నేరేడుచర్ల మండలం మేడారం గ్రామంలో గురువారం ఫుడ్ స్టోరేజ్ (ఆహార నిల్వ) భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ భవనం నిర్మాణంతో గ్రామంలో ఆహార నిల్వ సదుపాయాలు మెరుగుపడి ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని నాయకులు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి


ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు



ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పారేపల్లి సత్యనారాయణ, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో సోమసుందర్ రెడ్డి, ఎంపీవో నాగరాజు, ఏఈ కళ్యాణ్, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టా రామారావు, మాజీ చైర్మన్ ప్రకాష్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ సురేష్ రెడ్డి, ఏపీఎం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు కట్టా కృష్ణారావు, ఉప సర్పంచ్ పెద్ది సైదులు, వీవో అధ్యక్షురాలు కవిత, వీవోఏ ఝాన్సీతో పాటు గ్రామ కాంగ్రెస్ నాయకులు మామిడి వెంకటేశ్వర్లు, రాములు, ముక్కంటి, రాజీవ్, రాకేష్, సురేష్, మల్లయ్య, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నాయకులు పిలుపునిచ్చారు.