Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తి: ఎస్పీ నరసింహ

Author
Posted By DAINAMIC NEWS
| 06 Aug 2026, 04:05 AM | తాజా సమాచారం
ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తి: ఎస్పీ నరసింహ


సూర్యాపేట బ్యూరో , ఆగస్టు 6,శుభోదయ డైనమిక్ వార్త



తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తిప్రదాత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని గురువారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఎస్పీ మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంత ప్రజల హక్కులు, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం ప్రొఫెసర్ జయశంకర్ జీవితాంతం అంకితభావంతో కృషి చేశారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజల్లో చైతన్యం నింపడంతో పాటు ఉద్యమానికి సిద్ధాంతపరమైన దిశానిర్దేశం చేసిన మహనీయుడిగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు.



తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంత బలం అందించిన మహనీయుడు


ఇవి కూడా చదవండి


ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఎస్పీ నరసింహ అన్నారు. సమాజ శ్రేయస్సు, ప్రజా హక్కుల పరిరక్షణ కోసం ఆయన చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తెలంగాణ చరిత్రలో ఆయన సేవలు చిరస్మరణీయమని తెలిపారు.



పోలీస్ అధికారులు, సిబ్బంది ఘన నివాళి



ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డీసీఆర్‌బీ డీఎస్పీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ మగ్దుం అలీ, ఆర్‌ఐ జానయ్య, ఆర్‌ఎస్‌ఐలు సురేష్, రాజశేఖర్, సాయిరాం, అన్వర్, అశోక్, సీసీ సందీప్‌తో పాటు జిల్లా పోలీస్ సిబ్బంది పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమం అనంతరం ఆయన సేవలను స్మరించుకుంటూ తెలంగాణ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడారు.