Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వినాయకుడి సన్నిధిలో ఘనంగా కుంకుమ పూజ భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మహిళలు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎస్‌ఐ దంపతులు

Author
Posted By DAINAMIC NEWS
| 22 Sep 2026, 11:53 PM | తాజా సమాచారం
వినాయకుడి సన్నిధిలో ఘనంగా కుంకుమ పూజ భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మహిళలు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎస్‌ఐ దంపతులు


మోతే, సెప్టెంబర్ 23,శుభోదయ డైనమిక్ వార్త



రాఘవపురం ఎక్స్‌రోడ్ గ్రామపంచాయతీ పరిధిలోని రామాలయంలో కొలువుదీరిన వినాయకుడి విగ్రహం వద్ద మంగళవారం రాత్రి కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.



ఎస్‌ఐ దంపతుల ప్రత్యేక పూజలు


ఇవి కూడా చదవండి


మోతే ఎస్‌ఐ బి. లచ్చి రెడ్డి దంపతులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు కుంకుమ పూజలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.



సందడిగా మారిన ఆలయ ప్రాంగణం



ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోల లింగయ్య గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు కారింగుల లింగమూర్తి గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి మండవ శ్రీనివాస్ గౌడ్, కోల నరసయ్య తదితరులు పాల్గొన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో రామాలయ ప్రాంగణం సందడిగా కనిపించింది.