Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వైద్య చికిత్సలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండ మోతేలో 41 మంది లబ్ధిదారులకు రూ.17.06 లక్షల చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

Author
Posted By DAINAMIC NEWS
| 29 Sep 2026, 05:40 AM | తాజా సమాచారం
వైద్య చికిత్సలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండ మోతేలో 41 మంది లబ్ధిదారులకు రూ.17.06 లక్షల చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి


పేద కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించడమే లక్ష్యం



అర్హులందరికీ సంక్షేమ పథకాల ప్రయోజనం అందేలా కృషి


ఇవి కూడా చదవండి


మోతే, శుభోదయ డైనమిక్ వార్త, సెప్టెంబర్ 29



మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 41 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) ద్వారా మంజూరైన రూ.17,06,550 విలువైన చెక్కులను ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి మంగళవారం క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో వైద్య చికిత్సలు పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తోందన్నారు. వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు.అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. మోతే మండలానికి మొత్తం రూ.17,06,550 సీఎంఆర్‌ఎఫ్‌ సాయం మంజూరైనట్లు తెలిపారు.చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్‌రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.