Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

60 వేల మంది విద్యార్థులకు అల్పాహారం మునగాలలో రూ.9.60 కోట్లతో అత్యాధునిక కమ్యూనిటీ కిచెన్‌

60 వేల మంది విద్యార్థులకు అల్పాహారం  మునగాలలో రూ.9.60 కోట్లతో అత్యాధునిక కమ్యూనిటీ కిచెన్‌

ముఖ్యమైన పాయింట్స్:

  • 60 వేల మంది విద్యార్థులకు అల్పాహారం
  • మునగాలలో రూ.9.60 కోట్లతో అత్యాధునిక కమ్యూనిటీ కిచెన్‌
  • అక్టోబర్‌ 6న శంకుస్థాపన చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

60 వేల మంది విద్యార్థులకు అల్పాహారం

మునగాలలో రూ.9.60 కోట్లతో అత్యాధునిక కమ్యూనిటీ కిచెన్‌

అక్టోబర్‌ 6న శంకుస్థాపన చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

సూర్యాపేట, అక్టోబర్‌ 4: జిల్లాలోని 1,029 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న సుమారు 60 వేల మంది విద్యార్థులకు ప్రతిరోజూ అల్పాహారం అందించేందుకు మునగాల మండలంలో రూ.9.60 కోట్లతో అత్యాధునిక కమ్యూనిటీ కిచెన్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు అక్టోబర్‌ 6న మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.

మునగాల–మాధారం మధ్య కేంద్రీకృత వంటశాల

మునగాల మండలంలో జాతీయ రహదారి పక్కన మునగాల–మాధారం మధ్య ఎంపిక చేసిన స్థలంలో కమ్యూనిటీ కిచెన్‌ను నిర్మించనున్నారు. ఒకే కేంద్రంలో పెద్ద ఎత్తున అల్పాహారం తయారు చేసి, ప్యాకింగ్‌ చేసి, ప్రత్యేక వాహనాల ద్వారా విద్యాసంస్థలకు తరలించేలా వ్యవస్థను రూపొందిస్తున్నారు.

సింగరేణి విరాళంతో రూ.9.60 కోట్ల ప్రాజెక్టు

ఇవి కూడా చదవండి

కమ్యూనిటీ కిచెన్‌ నిర్మాణానికి సింగరేణి సంస్థ రూ.9.60 కోట్ల విరాళాన్ని అందించింది. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి చేసిన విజ్ఞప్తి మేరకు సింగరేణి ఈ నిధులను సమకూర్చినట్లు తెలిపారు.

1,029 విద్యాసంస్థలకు అల్పాహారం

హరేకృష్ణ మూవ్‌మెంట్‌ ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ సహకారంతో ప్రాజెక్టును అమలు చేయనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న దాదాపు 60 వేల మంది విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం అల్పాహారం అందించడం ప్రధాన లక్ష్యం. అవసరాన్ని బట్టి కొన్ని జూనియర్‌ కళాశాలలకు మధ్యాహ్న భోజనం అందించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

నాణ్యత, పరిశుభ్రతకు పెద్దపీట

ఆహార తయారీ నుంచి ప్యాకింగ్‌, రవాణా, పంపిణీ వరకు సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలతో కూడిన ఆహారం అందించడంతో పాటు పరిశుభ్రత, ఆహార భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

పనులను పర్యవేక్షించనున్న మంత్రి

కమ్యూనిటీ కిచెన్‌ నిర్మాణం, నిర్వహణ, ఆహార తయారీ, విద్యాసంస్థలకు సరఫరా తదితర అంశాలను మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పర్యవేక్షించనున్నారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, అధికారులు, అమలు భాగస్వాములతో సమన్వయం చేసుకుంటూ పనుల పురోగతిని సమీక్షించనున్నారు. నిర్మాణం పూర్తయిన అనంతరం జిల్లాలోని వేలాది మంది విద్యార్థులకు ప్రతిరోజూ అల్పాహారం అందుబాటులోకి రానుంది.