Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

విద్యుత్ మీటర్లు బయటకు స్పష్టంగా కనిపించేలా ఉంచాలి

విద్యుత్ మీటర్లు బయటకు స్పష్టంగా కనిపించేలా ఉంచాలి

ముఖ్యమైన పాయింట్స్:

  • విద్యుత్ మీటర్లు బయటకు స్పష్టంగా కనిపించేలా ఉంచాలి
  • వినియోగదారులకు ఏఈ ఓగూరి రమణయ్య విజ్ఞప్తి

కారంపూడి, శుభోదయ డైనమిక్ వార్త

కారంపూడి మండలంలోని విద్యుత్ వినియోగదారులు తమ ఇళ్లలోని విద్యుత్ మీటర్లను బయటకు స్పష్టంగా కనిపించేలా, మీటర్ రీడింగ్ సిబ్బందికి సులభంగా అందుబాటులో ఉండే విధంగా ఉంచాలని ఏఈ ఓగూరి రమణయ్య సూచించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.మీటర్ రీడింగ్ సిబ్బందికి వినియోగదారులు సహకరించడం ద్వారా విద్యుత్ వినియోగానికి అనుగుణంగా సక్రమమైన రీడింగ్ నమోదు అవుతుందని పేర్కొన్నారు. తద్వారా రీడింగ్‌లో పొరపాట్లు, అధిక బిల్లులు వచ్చే సమస్యలను నివారించవచ్చన్నారు.అదేవిధంగా విద్యుత్ మీటర్లు సిబ్బందికి సులభంగా కనిపించేలా ఉండటం వల్ల వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సేవలు అందించడం మరింత సులభమవుతుందని ఏఈ తెలిపారు. ప్రతి వినియోగదారుడు విద్యుత్ శాఖ సిబ్బందికి, మీటర్ రీడర్లకు సహకరించాలని ఆయన కోరారు.

ఇవి కూడా చదవండి