Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

శ్రీ వాసవి ఆర్యవైశ్య కార్తీకమాస వన సమారాధన కరపత్రాల ఆవిష్కరణ

Author
Posted By DAINAMIC NEWS
| 23 Oct 2025, 04:45 AM | ఆంధ్ర ప్రదేశ్
శ్రీ వాసవి ఆర్యవైశ్య కార్తీకమాస వన సమారాధన కరపత్రాల ఆవిష్కరణ


డైనమిక్,కారం పూడి, అక్టోబర్ 23



కారం పూడి పట్టణంలో గురువారం మండల శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 2025 సంవత్సరానికి సంబంధించిన కార్తీకమాస వన సమారాధన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరిగింది.



వనభోజనాలు సింగరట్ల దేవస్థానంలో



కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ ఆదివారం స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి సింగరట్ల దేవస్థానంలో కార్తీకమాస వనభోజనాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ఆదివారం ఉదయం 8 గంటలకు అంకాలమ్మ తల్లి గుడి వద్ద నుండి బస్సులు బయలుదేరతాయి.



ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలు


ఇవి కూడా చదవండి


ఉదయం 9 గంటలకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు, మధ్యాహ్నం 12 గంటలకు కార్తీకమాస వనభోజనాలు, అనంతరం సంగీత విభావరి కార్యక్రమాలు జరుగుతాయని కమిటీ సభ్యులు తెలిపారు.



అవసర ఏర్పాట్లు పూర్తి



ఈ కార్యక్రమం విజయవంతం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వన సమారాధన కమిటీ ప్రకటించింది. కార్యక్రమం సాఫల్యవంతం కావాలంటూ ఆర్యవైశ్య పెద్దలు, యువజన సంఘ నాయకులు పాల్గొనాలని కోరారు.



కార్యక్రమంలో పాల్గొన్నవారు



ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఎస్‌.పి.ఆర్‌. కృష్ణ,శ్రీ వాసవి అన్న ప్రసాదం కమిటీ ఫౌండర్ బవిరిశెట్టి రామారావు,ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు సముద్రాల పవన్ సాయి,
సంఘం నాయకులు చలవాది మాధవ్, సురే సుబ్రహ్మణ్యం, ఆతుకూరి గోపి,ఆర్యవైశ్య పెద్దలు చితిరాల వెంకట కోటేశ్వరరావు, యకల శ్రీనివాసరావు, కొత్త నరసింహారావు,యువజన నాయకులు కరాలపాటి సాయి తదితరులు పాల్గొన్నారు.